Diwali 2023: దీపావళి సంబరాల్లో అపశ్రుతి.. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అగ్నిప్రమాద ఘటనలు..

|

Nov 13, 2023 | 7:35 AM

మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కెమికల్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతుండగా ముగ్గురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ పలువురికి గాయాలయాయ్యి. బాణాసంచా పేలి 40 మందికి పైగా గాయపడ్డారు. బాధితులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌ సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Diwali 2023: దీపావళి సంబరాల్లో అపశ్రుతి.. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అగ్నిప్రమాద ఘటనలు..
Diwali Fire Accidents
Follow us on

దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిల్లో పది చోట్ల అగ్నిప్రమాదాలు జరిగి భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు పండుగ వేళ టపాసులు కాలుస్తూ గాయపడ్డవారు హైదరాబాద్ సరోజినీ దేవి ఆసుపత్రికి క్యూ కట్టారు. దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌ పాతబస్తీ శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్‌ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. సౌత్ జోన్‌ డీసీపీ సాయి చైతన్య ఫైర్‌ సిబ్బందిని రప్పించి ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తూనే ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌కు మంటలు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించారు. భారీ ప్రమాదాన్ని తప్పించారు.

మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కెమికల్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతుండగా ముగ్గురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ పలువురికి గాయాలయాయ్యి. బాణాసంచా పేలి 40 మందికి పైగా గాయపడ్డారు. బాధితులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సహా వివిధ కంటి ఆస్పత్రులకు చికిత్స పొందడానికి క్యూ కట్టారు.

మరోవైపు విశాఖ జిల్లా అగనంపూడిలోని బొర్రమాంబ గుడి దగ్గర ఉన్న స్క్రాప్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. విశాఖ పట్నంలోనే అగ్నిప్రమాదం జరిగింది. సంఘం ఆఫీస్ ప్రాంతంలోని సాయి సుగుణ అపార్ట్ మెంట్ అయిదో అంతస్తులో తాళం వేసి ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. దీంతో మిగతా ఫ్లాట్లలో ఉండేవారు పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

ఇవి కూడా చదవండి

గుంటూరు గౌరి శంకర్ ధియేటర్ సమీపంలోని ప్లాస్టిక్ వేస్ట్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో దుకాణం అగ్నికి ఆహుతైంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..