YSR Pensions – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ జోరుగా సాగింది. ఈ తెల్లవారుజాము నుంచే పెన్షనర్ల ఇంటి వద్దే పెన్షన్ మొత్తాలను అందించారు వాలంటీర్లు. మొత్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాయంత్రం 4 గంటల వరకు 76.43 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయగా, సాయంత్రం 5 గంటల వరకు 77.03 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయింది. లబ్ధిదారుల చేతికి రూ. 1109.16 కోట్లు అందజేశారు.
ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60.50 లక్షల మందికి పెన్షన్లు అందజేయాలని, అందుకోసం రూ.1455.87 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.
Read also: Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!