దిశ యాప్ మహిళలకు ఎంతలా అవసరమో తెలియజెప్పే ఘటన ఇది. తాడేపల్లికి చెందిన ప్రత్యూష అనే గృహిణి రోడ్‌పై వస్తున్న సమయంలో ఒక వ్యక్తి తనను వెంబడిస్తున్నాడని గమనించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వివరాలు నోట్ చేసుకున్న తాడేపల్లి పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటం గమనించిన ఆకతాయి అక్కడ్నుంచి పరారయ్యాడు. అనంతరం దిశ యాప్ కు ఫిర్యాదు చేసిన మహిళ వద్ద సమాచారం తీసుకొని సదరు మహిళకు ధైర్యం చెప్పి సురక్షితంగా ఇంటికి చేర్చారు. జరిగిన ఘటనపై ప్రత్యూష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ యాప్ మహిళకు ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి యాప్ వల్ల తన మహిళలు ధైర్యంగా ప్రయాణాలు చేసేందుకు వీలుంటుందని… ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫిర్యాదు చేసిన అనంతరం స్పందించిన పోలీసులు తీరుపై ప్రత్యూష హర్షం వ్యక్తం చేశారు. దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లో.. పోలీసులు తన వద్ద ఉన్నారని ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉంచుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా యాప్ వినియోగించుకోవాలని ప్రత్యూష సూచించారు.
టి. నాగరాజు, టీవీ9, గుంటూరు
Also Read: Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి