Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి

| Edited By: Balaraju Goud

Apr 16, 2024 | 6:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనుకోని సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యాయి. అధినేత సమక్షంలో ముఖం చాటేశారు.

Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి
Tdp Leaders
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనుకోని సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యాయి. అధినేత సమక్షంలో ముఖం చాటేశారు.

పలాసలో టీడీపీ కార్యాలయం వద్ద కింజరాపు అచ్చెన్నాయుడుకి, గుండ లక్ష్మి దేవి కుటుంబానికి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు బస చేసిన పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ దంపతులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఎడ ముఖం,పెడ ముఖంగా వ్యవహరించిన తీరు అక్కడున్న పార్టీ నాయకుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన గుండ దంపతులు అక్కడే ఉన్న హాల్‌లో నిరీక్షించేందుకు వెళ్ళారు. అప్పటికే ఆ హాల్‌లో ఎదురుగా అచ్చెన్నాయుడు కూర్చుని కనిపించాడు. అచ్చెన్నాయుడును ఒక్కసారిగా హాల్‌లో చూసి మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు.

అనంతరం మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ బయటికి వచ్చి అప్పల సూర్యనారాయణను రిసీవ్ చేసుకుని పక్కనే ఉన్న వేరొక రూంలోకి తీసుకువెళ్లారు. అప్పల సూర్యనారాయణ భార్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి అదే హాల్లో ఉన్నా అచ్చిన్నాయుడుకు దూరంగా కూర్చున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎదురుగానే ఉన్న ఆయన్ను ఏమాత్రం పలకరించలేదట. కింజరాపు కుటుంబం ముందు నుంచి తమను అణచి వేస్తుందంటూ గతంలోనే మీడియా ముందు బహిరంగంగానే అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు గుండ లక్ష్మి దేవి దంపతులు. లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా గొండు శంకర్‌కు అచ్చెన్నాయుడు టికెట్ కేటాయించారంటూ గుండ వర్గం ఆరోపించింది. తాజాగా పార్టీ అధినేతను కలిసేందుకు వచ్చి ఆయన సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు వ్యవహరించిన తీరు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…