Meat Market: టీవీ9 నిఘాలో వెలుగులోకి సంచలన నిజాలు.. మీరు మాంసం తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
Meat Market: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాణ్యమైన ఆహారంవైపు తమ దృష్టిని మళ్లిస్తున్నారు. కరోనా రక్కనిసి ఎదుర్కోవాలంటే..
Meat Market: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాణ్యమైన ఆహారంవైపు తమ దృష్టిని మళ్లిస్తున్నారు. కరోనా రక్కనిసి ఎదుర్కోవాలంటే బలవర్ధకమైన ఆహారం తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్యూనిటీ పెంచే పండ్లు, పలహారాలతో పాటు మాంసం వంటి ఆహారాన్ని కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఎక్కువగా మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు, ఆరగిస్తున్నారు. ముఖ్యంగా మటన్‌కు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఆ గిరాకీ మేరకు ధర కూడా పెరిగింది. అయితే, కొందరు దీన్ని తమ స్వార్థానికి మలుచుకుంటున్నారు. చచ్చిపోయిన గొర్రెలు, మేకలను కొని అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలసుకున్న టీవీ9 నిఘా టీమ్.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. వివరాల్లోకెళితే.. జగ్గయ్యపేట సంతలో చనిపోయిన మేకలు, గొర్రెలను విక్రయిస్తున్నారు. ఈ చచ్చిపోయిన గొర్రెలు, మేకలు కొనేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. అతి తక్కువ ధరకే మేకలు, గొర్రెలు వస్తుండటమే దీనికి కారణం.
వాస్తవానికి బ్రతికున్న గొర్రె, మేక ధర రూ. 10 వేల వరకు ఉంటుంది. కానీ, చినిపోయిన మేక, గెర్రను రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. ఇంత తక్కువ ధరకు లభిస్తుండటంతో చనిపోయిన వాటినే కొనుగోలు చేసేందుకు మటల్ మాఫియా ఆసక్తి చూపుతోంది. ఆ నేపథ్యంలోనే భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుంది కూడా. జగ్గయ్యపేట సంతలో కొనుగోలు చేసిన మేకలను రాజమండ్రి, భీమవరం, పాలకొల్లు, తణుకు, మచిలీపట్నం తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మటన్ మాఫియా నుంచి ముడుపులు తీసుకోవడం వల్లే అధికారులు ఇలా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం మవుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ చనిపోయిన గొర్రెలు, మేకలు తినడం వల్ల ప్రజలు మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సదరు మృత గొర్రెలు, మేకలు ఈ కారణంగా చనిపోయానేది తెలియదు. ఏదైనా వ్యాధుల కారణంగా చనిపోయినట్లయితే.. వాటి మాంసాన్ని తినడం ద్వారా కొత్త రోగాలను తెచ్చుకున్నట్లవుతుంది. అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. తాజాగా వెలుగు చూసిన ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తుంది.
Also read:
Horoscope Today: ఆ రాశుల వారంతా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.. ఆదివారం రాశి ఫలాలు ..