Andhra Pradesh: స్విమ్మింగ్ పూల్‌లో ఫీట్స్ చేసి అదరగొట్టిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

| Edited By: Aravind B

Jul 06, 2023 | 2:49 PM

ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రజాప్రతినిధులు ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు కొంత సమయాన్ని సరదాగా గడుపుతుంటారు. ఆ తరహాలోనే ఓ నాయకుడు స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ అలసట తీర్చుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా నీటిలో ఓ అరుదైన ఆసనం వేసి, అందరినీ ఔరా అనిపించారు.

Andhra Pradesh: స్విమ్మింగ్ పూల్‌లో ఫీట్స్ చేసి అదరగొట్టిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
Koragtla Veerabhadra Swami
Follow us on

ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రజాప్రతినిధులు ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు కొంత సమయాన్ని సరదాగా గడుపుతుంటారు. ఆ తరహాలోనే ఓ నాయకుడు స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ అలసట తీర్చుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా నీటిలో ఓ అరుదైన ఆసనం వేసి, అందరినీ ఔరా అనిపించారు. పిల్లలకు, యువతకు స్విమ్మింగ్ పై అవగాహన కల్పించేందుకు ఆ అరుదైన ఫీట్ చేశారు. ఆయనే ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ప్రస్తుతం గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయాల్లో కొంతమంది తమ షెడ్యూల్ ను కాసేపు పక్కన పెట్టి, అలసట తీర్చుకునేందుకు వారికిష్టమైన పనులు చేస్తుంటారు. తద్వారా మానసిక ఉల్లాసం పొందుతుంటారు.

 

ఇవి కూడా చదవండి

 

 

ఇదే తరహాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఓ అరుదైన ఫీట్ ను చేసి అబ్బురపరిచారు. ఈ నెల 11న నేషనల్ స్విమ్మింగ్ డే సందర్భంగా యువతకు స్విమ్మింగ్ పై అవగాహన కల్పించనున్నారు. అందులో భాగంగా విజయనగరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గల స్విమ్మింగ్ ఫూల్ లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సరదాగా కాసేపు స్విమ్మింగ్ చేశారు. ఈ సందర్భంగా నీటిలో గంట సేపు శవాసనం వేసి, అందరినీ అలరించారు. కాళ్లు, చేతులు కదపకుండా, వెల్లకిలా పడుకొని, గంటపాటు కదలకుండా నీటి పైనే తేలియాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

తమ నాయకుడి విన్యాసాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి ఆసనం చూసి సంబరపడిపోయారు. 63 ఏళ్ల వయస్సులో సుమారు 120 కేజీలకు పైగా బరువుండే కోలగట్ల నీటి పై తేలియాడుతూ గంట పాటు గడిపారు.. అంత బరువు ఉండే కోలగట్ల నీటి పై ఎలా తెలియాడారు అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ హోదాలో అరవై మూడు ఏళ్ల వయస్సు లో 120 కేజీల బరువుతో నీటి పై తేలియాడటo రికార్డ్ గా భావిస్తున్నారు కోలగట్ల..

 

(రిపోర్టర్ : కోటేశ్వరావు గమిడి)