Gas Adulteration: వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాల్లో భారీ మోసం.. ఎలా గుర్తించారంటే..

|

Jan 13, 2022 | 5:14 PM

Gas Adulteration: వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాలలో మోసాలు మరోసారి బట్టబయలయ్యాయి. వినియోగదారులను నిట్టనిలువునా మోసం చేస్తుండగా..

Gas Adulteration: వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాల్లో భారీ మోసం.. ఎలా గుర్తించారంటే..
Follow us on

Gas Adulteration: వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాలలో మోసాలు మరోసారి బట్టబయలయ్యాయి. వినియోగదారులను నిట్టనిలువునా మోసం చేస్తుండగా తూనికలు కొలతల శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మోసాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీపై మరోసారి కేసులు నమోదు చేశారు అధికారులు. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ అక్రమాలకు వేదికగా మారింది. నిత్యం వినియోగదారులను మోసం చేస్తుంది. గతంలో కూడా కేసులు నమోదైనప్పటికీ ఏజెన్సీ నిర్వాహకుల్లో మార్పు రాలేదు. తాజాగా మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వంట గ్యాస్ సిలిండర్లకు సీల్ లేకుండా విక్రయిస్తూ నిర్వాహకులు అడ్డంగా దొరికిపోయింది గ్యాస్ ఏజెన్సీ. వంట గ్యాస్ సిలిండర్ల నుంచి ఒక్కొక్క సిలిండర్ నుంచి రెండు కిలోల వంటగ్యాస్ బయటకు తీసి విడిగా విక్రయిస్తున్నారు. ఇలాంటి లూజ్ సిలిండర్లను వినియోగదారులకు విక్రయించేందుకు వెళుతున్న భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆటోను తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీ చేశారు. సీలింగ్ లేని సిలిండర్లు ఉండటమే కాకుండా.. ఒక సిలిండర్లో రెండు కిలోల చొప్పున గ్యాస్ తక్కువగా ఉండటాన్ని గుర్తించారు అధికారులు. దాంతో ఏజెన్సీ పై కేసు నమోదు చేశారు. కాగా, డోన్ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేయడం దౌర్జన్యాలు నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలిసింది.

Also read:

Viral Video: ఈ పిల్ల పంచ్ పవర్‌ మాములుగా ఉండదు.. దెబ్బ పడితే ఇక అంతే.. చూస్తే మతిపోవాల్సిందే!

IND vs SA: కేప్ టౌన్‌ టెస్ట్‌తో వీరిద్దరి కెరీర్‌కు ముగింపు? మిడిలార్డర్‌లో మార్పులకు ఇదే శుభతరుణం అంటోన్న మాజీలు

మూడు పాజిటివ్ కేసులు నమోదైతే అపార్ట్‌మెంట్ మొత్తం కంటైన్మెంట్ జోన్.. కరోనా కట్టడికి BBMP కీలక నిర్ణయం