Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ అమ్మాయి చూడటానికే ఫ్లవర్‌లా ఉంటది.. పంచ్‌లు మాత్రం ఫైర్‌.. చూస్తే మతిపోవాల్సిందే!

పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత మీరు వినే ఉంటారు. అది సరిగ్గా ఈ అమ్మాయికి సరిపోతుంది...

Viral Video: ఈ అమ్మాయి చూడటానికే ఫ్లవర్‌లా ఉంటది.. పంచ్‌లు మాత్రం ఫైర్‌.. చూస్తే మతిపోవాల్సిందే!
Strongest Girl
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 13, 2022 | 5:23 PM

పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత మీరు వినే ఉంటారు. అది సరిగ్గా ఈ అమ్మాయికి సరిపోతుంది. ఈమె అలాంటి.. ఇలాంటి పిల్ల కాదు. చిన్నతనం నుంచే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఆమె పంచ్ పవర్ మాములుగా ఉండదు. ఏకంగా ఉక్కు తలుపులను, చెట్లను సైతం పంచ్‌లతో సునాయాసంగా పడగొడుతుంది. ఈమె అపారమైన ప్రతిభకు అడ్డంపట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

పై వీడియోలో కనిపిస్తోన్న అమ్మాయి పేరు ఇవింక సావకస్‌. ఈమెకు 12 ఏళ్లు. తన తండ్రి రుస్త్రమ్ సాద్వాకాస్‌ వద్ద చిన్నతనం నుంచి బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. నాలుగేళ్ల వయసప్పుడే కూతురి ప్రతిభను రుస్త్రమ్ గుర్తించారు. తనకంటే వయసులో పెద్దవారు తీసుకునే శిక్షణను సైతం ఇవింక అలవోకగా తీసుకునేదని.. ఒక్క నిమిషంలోనే సుమారు 100 పంచ్‌లు విసురుతుందని రుస్త్రమ్ తెలిపారు.

కాగా, ఈ అమ్మాయి తన పవర్‌ఫుల్ పంచ్‌లతో సునాయాసంగా చెట్లు, ఉక్కు తలుపులను పగలగొట్టేస్తుంది. వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్‌గా పేరుపొందిన ఇవింక వైరల్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.

Also Read: 

వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!

ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!

పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!