Cyclone Gulab: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న ‘గులాబ్’.. సముద్రంలో అలజడి

|

Sep 26, 2021 | 12:44 PM

ఆంధ్రా- ఒడిశాను గులాబ్ తుఫాను వణికిస్తోంది. సాయంత్రం తీరం దాటనుండటంతో ...ఇప్పటికే పలుచోట్ల గాలులు, సముద్రంలో అలజడి మొదలైంది.

Cyclone Gulab: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న గులాబ్.. సముద్రంలో అలజడి
Cyclone Gulab
Follow us on

ఆంధ్రా- ఒడిశాను గులాబ్ తుఫాను వణికిస్తోంది. సాయంత్రం తీరం దాటనుండటంతో …ఇప్పటికే పలుచోట్ల గాలులు, సముద్రంలో అలజడి మొదలైంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. IMD విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గులాబ్ తుఫాను ఒడిషా, ఆంధ్రాపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లుగా పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో బలమైన ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

రేపు కోస్తాంధ్రలోని ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. కళింగపట్నం దగ్గర సాయంత్రం ఇది తీరం దాటే అవకాశముండటంతో మూడు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం దాటే సమయంలో..తీరం దాటిన తర్వాత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణకేంద్రం వెల్లడించింది. దీంతో జిల్లాలోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రవేటను రద్దు చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 12 మండలాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుందని..అందుకోసం 75 ప్రాంతాల్లో తాము సహాయక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ శ్రీకేశ్‌ బి. లాఠకర్ తెలిపారు. అయితే ప్రజలు అధికారులతో సహాకరించాలని కలెక్టర్‌ కోరుతున్నారు.  గులాబ్‌ తుఫాను ప్రభావం ఉభయగోదావరి జిల్లాలపై కూడా పడనుంది. ఇప్పటికే నరసాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర వేటకు వెళ్లవద్దన్న అధికారుల హెచ్చరికల నేపధ్యంలో మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. జిల్లాలో తుఫాను వల్ల సంభవించే మార్పులను ఎదుర్కొనేందుకు జిల్లాలో SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

Also Read: గబ్బర్‌ సింగ్‌పై కౌంటర్‌ ఎటాక్‌… పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి.. తీవ్ర వ్యాఖ్యలు

వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు… చివర్లో మాములు ట్విస్ట్ కాదు