Cyclone Michaung Effect: రైతులను ముంచిన మిచౌంగ్.. దెబ్బతిన్న పంటను ‎కేత్ర స్థాయిలో పరిశీలించనున్న అధికారులు..

| Edited By: Srikar T

Dec 13, 2023 | 7:53 AM

తిరుపతి జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది మిచౌంగ్ తుఫాను. 2500 హెక్టార్లలో ఇసుక మేటలు, నేల కోతకు గురైన పంట పొలాలుతో పాటు 3500హెక్టార్లలో పంట నష్టం వాటిల్లేందుకు కారణం అయ్యింది. ఇప్పటిదాకా ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. నేటి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన షురూ చేసింది. ఈనెల 18 నుంచి 22 వరకు ఆర్ బి కే కేంద్రాల్లో సోషల్ ఆడిట్ చేయనుండగా రేపో, మాపో కేంద్ర బృందం కూడా పర్యటించనుంది.

Cyclone Michaung Effect: రైతులను ముంచిన మిచౌంగ్.. దెబ్బతిన్న పంటను ‎కేత్ర స్థాయిలో పరిశీలించనున్న అధికారులు..
Cyclone Michaung Effect
Follow us on

తిరుపతి జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది మిచౌంగ్ తుఫాను. 2500 హెక్టార్లలో ఇసుక మేటలు, నేల కోతకు గురైన పంట పొలాలుతో పాటు 3500హెక్టార్లలో పంట నష్టం వాటిల్లేందుకు కారణం అయ్యింది. ఇప్పటిదాకా ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. నేటి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన షురూ చేసింది. ఈనెల 18 నుంచి 22 వరకు ఆర్ బి కే కేంద్రాల్లో సోషల్ ఆడిట్ చేయనుండగా రేపో, మాపో కేంద్ర బృందం కూడా పర్యటించనుంది.

మిచౌంగ్ తుఫాన్ తిరుపతి జిల్లా రైతాంగాన్ని‎ కోలు కోలేని దెబ్బతీసింది. శ్రీకాళహస్తి సత్యవేడు డివిజన్‎లలో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇసుక మేటలతో నేల కోతకు గురైన పంట పొలాలు రబీ సాగుకు రైతన్నను దూరం చేసింది. 3500 హెక్టార్లలో పంట నష్టం, 2500 హెక్టార్లలో ఇసుక మేటలు నేలకోతకు పంట పొలాలు రైతు కంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు రెండు నియోజకవర్గాల్లోని ఆరు మండలాల్లో ఇలాంటి పరిస్థితే దాపురించింది. పంటలు సాగు చేసిన రైతులు సాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి కారణమైంది. దాదాపు 10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో వరద నీరు ఇంకా పంట పొలాల్లోనే ఉండగా వరినారుతోపాటు పలు ఉద్యానవన పంటలు ఇసుక మేటల్లో కూరుకుపోయాయి. ప్రత్యేకించి తూర్పు మండలాల్లో రబీ సాగుకు సిద్ధమైన రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టేసిన తుఫాన్ జిల్లాలోని చెరువులు రిజర్వాయర్లు నిండిపోయేలా చేసింది.

తుఫాన్‎తో జరిగిన నష్టం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రబి సాగులో తొలి దశలో వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం సోషల్ ఆడిట్ కూడా నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. కాలంగి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడం, మరోవైపు గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న పంట పొలాల్లోకి వేలాది క్యూసెక్కుల నీరు చేరింది. ఒక్క సబ్ డివిజన్‎లోనే 4840 హెక్టార్లలో వరి దెబ్బతినగా, ఏపీలో ఉద్యానవన పంటలు, పండ్లు సాగు చేసిన రైతులు లక్షలాది రూపాయల అప్పులను మూటగట్టుకున్న పరిస్థితి దాపురించింది. తీర ప్రాంత గ్రామాల్లో ఇసుక మేటలు రైతులు పొలాల్లో సేద్యం చేసే పరిస్థితి లేకుండా చేసాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..