Miachaung Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మిచౌంగ్’ తుఫాన్.. భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

| Edited By: Shaik Madar Saheb

Dec 01, 2023 | 10:46 AM

Miachaung Cyclone Updates: బంగాళాఖాతంలో అల్పాపీడనం వాయుగుండంగా మారింది. వాతావరణ శాఖ తాజా బుల్లెటిన్ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతనికి అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, బాపట్లకు 990, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Miachaung Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Miachaung Cyclone
Follow us on

Miachaung Cyclone Updates: బంగాళాఖాతంలో అల్పాపీడనం వాయుగుండంగా మారింది. వాతావరణ శాఖ తాజా బుల్లెటిన్ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతనికి అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, బాపట్లకు 990, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతు రెండో తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. డిసెంబర్ మూడో తేదీ నాటికి నైరుతి బంగాళా ఖాతంలో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ కు మాయన్మార్ దేశం సూచించిన ‘మిచౌంగ్ ‘ గా నామకరణంగా చేశారు. తుపాన్ గా మారిన తరువాత వాయువ్య దిశగా తుపాను కదులుతూంది. ఆ తరువాత మిచౌంగ్ తుపాను నాలుగో తేదీన నాటికి చెన్నై – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్టు అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

బాపట్ల సమీపంలోనేనా..?

వాయుగుండాన్ని నిశితంగా పరిశీలిస్తుంది వాతావరణ శాఖ. తుఫానుగా మారాక దిశ, గమనంపై అంచనా వేస్తోంది. అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండం ఆ తర్వాత తుఫానుగా మారనున్న సిస్టంను ట్రాక్ చేస్తుంది. అయితే.. వాతావరణ శాఖ ట్రాక్ ప్రకారం.. నాలుగో తేదీ నాటికి చెన్నై నెల్లూరు సమీపానికి తుఫాను వచ్చాక.. ఐదో తేదీ నాటికి గుంటూరు తీరానికి అతి సమీపంలోకి వస్తుంది. ఆ తర్వాత బాపట్ల సమీపంలో తీరం దాటుతున్నట్టు ట్రాక్ సూచిస్తుంది. ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో మిచౌంగ్ తుఫాను .. ఏపీ పైనే ఎక్కువ ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ప్రధానంగా దక్షిణ కోస్తాపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ప్రస్తుత అంచనా ప్రకారం వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఇస్తున్నారు. భారీగా ఈదురుగాలు మీస్తాయని.. ఐదో తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.

తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీవ్రంగా ఉండనుంది. ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ఏడాది రెండు తుపాన్లు దిశ మార్చుకోవడంతో ఏపీలో లోటు వర్షపాతం నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు పడితే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..