AP Weather: జోవాద్‌ ఎఫెక్ట్.. నేడు, రేపు ఏపీలో పరిస్థితి ఇలా ఉండనుంది.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

|

Dec 03, 2021 | 9:05 AM

జోవాద్‌ దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.

AP Weather: జోవాద్‌ ఎఫెక్ట్.. నేడు, రేపు ఏపీలో పరిస్థితి ఇలా ఉండనుంది.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
Ap Weather
Follow us on

జోవాద్‌ దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి ఈ మధ్యాహ్నానికి తుఫాన్‌గా మారే ప్రమాదముందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ప్రస్తుతం విశాఖకు 770 కిలోమీటర్లు, పారాదీప్‌కు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నఈ వాయుగుండం..రేపు ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది వాతావరణ శాఖ. గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 100కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

జోవాద్‌ సైక్లోన్‌ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. ఇవాల్టి నుంచి విశాఖలో పర్యాటక ప్రాంతాలనూ మూసివేశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేసింది.

ఈరోజు (03-12-21) (ప్రస్తుత పరిస్థితి) (ఐఎండీ వార్నింగ్‌)

శ్రీకాకుళం – ఆరెంజ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షాలు)
విజయనగరం – ఆరెంజ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షాలు)
విశాఖపట్నం – ఆరెంజ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షాలు)
తూర్పుగోదావరి – ఎల్లో అలర్ట్ (భారీ వర్షాలు)
—————————-
పశ్చిమగోదావరి – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
కృష్ణాజిల్లా – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
గుంటూరు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
ప్రకాశం – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
నెల్లూరు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
కర్నూలు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
అనంతపురం – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
కడప – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
చిత్తూరు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
=================
రేపు (04-12-21) (రేపటి పరిస్థితి) (ఐఎండీ వార్నింగ్స్)

శ్రీకాకుళం – రెడ్ అలర్ట్ (కుండపోత)
విజయనగరం – రెడ్ అలర్ట్ (కుండపోత)
విశాఖపట్నం – రెడ్ అలర్ట్ (కుండపోత)
తూర్పుగోదావరి – ఆరెంజ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షాలు)
—————
పశ్చిమగోదావరి – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
కృష్ణాజిల్లా – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
గుంటూరు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
ప్రకాశం – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
నెల్లూరు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
కర్నూలు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
అనంతపురం – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
కడప – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)
చిత్తూరు – గ్రీన్ అలర్ట్‌ (సాధారణ వర్షాలు)

Also Read: మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్

Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్