Rain Alert: బయటకు రాకండి.. ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

|

Sep 01, 2024 | 8:15 AM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి.

Rain Alert: బయటకు రాకండి.. ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Rains
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా వాయిదా వేసుకోవాలని.. కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దంటూ IMD హెచ్చరించింది.. వాగులు, చెరువులు పొంగే ప్రమాదముందని.. చెరువులకు గండ్లు, రోడ్లు కొట్టుకుపోయే అవకాశాలున్నాయంటూ పేర్కొంది. నాలాలు, మ్యాన్‌హోల్స్‌ దగ్గర అత్యంత అప్రమత్తం అవసరమని హెచ్చరించింది.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ ఐఎండీ పేర్కొంది.. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదముందని పేర్కొంది. ట్రాన్స్‌ఫారం ఉన్న ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పోల్స్‌ దగ్గరకు వెళ్లొద్దని పేర్కొంది.. నల్లా, సంపుల్లో నీటిని కాచి వడబోసుకునే తాగాలని ఆరోగ్యశాఖ సూచించింది. డ్యామ్స్‌ పర్యటనలు తక్షణమే వాయిదా వేసుకోవాలని.. నీటి కుంటలు, వాగులు, నదులు, చెరువుల దగ్గర సెల్ఫీలు, రీల్స్‌ చేయొద్దంటూ హెచ్చరించింది..

కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం

కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయవాడలో మళ్లీ భారీ వర్షం మొదలైంది.. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతోంది.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ నిర్వహించారు. టెలి కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. పునరావస కేంద్రాల్లో మంచి భోజనం,వసతి ఏర్పాటు చేయాలని సూచించారు.. బుడమేరకు 30 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఇవి కూడా చదవండి

భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ విపత్తుల నిర్వాహణ శాఖ కార్యాలయం నుంచి హోంమంత్రి అనిత కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ, సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.