Headline: Cyclone Gulab Live: గులాబ్ తుపాను తీరం దాటింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఆదివారం రాత్రి తుఫాను తీరం దాటింది. మరో ఐదు గంటల్లో ఈ తుఫాను అల్పపీడనంగా మారి బలహీన పడనుంది. మరో వైపు తుపాను ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచనలు చేసింది. దేవునళ్తాడ, భావనపాడు, మూలపేట మధ్య తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉంది. ఆ సమయంలో 70 నుంచి 80 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలు, నిత్యావసర సరుకులను సిద్ధం చేసింది. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి అప్పలరాజు చెప్పారు.
Read Also…. Antarvedi Temple: నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి.. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులతో పూజలందుకుంటున్న క్షేత్రం