లాటరీలు, గిఫ్ట్‌ల పేరుతో ఇన్నాళ్లు అకౌంట్‌లో సొమ్ము మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు రూట్ మార్చేసి ఓటీపీ, మెసేజ్‌లు రాకుండానే అకౌంట్‌లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్‌తో ఖాతాదారుల ప్రమేయం లేకుండానే లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. విజయవాడలో ఈ తరహా మోసాలు అంతకుమించి అనేలా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత మూడున్నర నెలల కాలంలో 150 అకౌంట్ల నుంచి 45లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో న్యాయం చేయండంటూ ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు బాధితులు. డబ్బు పోయిన వాళ్లంతా ఎక్కడో ఒకచోట ఆధార్ బయోమెట్రిక్ వేసినవాళ్లే. సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లు కేంద్రంగా డేటా లీక్ అవుతున్నట్టు తెలుస్తోంది.
బయోమెట్రిక్ డేటా సేకరించి చాలా ఈజీగా నేరాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారులకు ఓటీపీ రాకుండా చాలా న్యాక్‌గా వ్యవహరిస్తున్నారు. బయోమెట్రిక్ డేటా సేకరించి ఆధార్ కార్డుల్ని క్లోనింగ్ చేస్తున్నారు. దీంతో పబ్లిక్ తెలియకుండా ఖాతాలు ఖల్లాస్ చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు పోలీసులు. మీ ఆధార్ నంబర్‌ను లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి యూఐడీఏఐ ఒక ఫీచర్‌ను తీసుకువచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..