AP Curfew: ఏపీలోని ఆ ప్రాంతాల్లో వారం రోజుల పాటు కర్ఫ్యూ.. ఎక్కడెక్కడంటే.?

|

Jul 28, 2021 | 7:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

AP Curfew: ఏపీలోని ఆ ప్రాంతాల్లో వారం రోజుల పాటు కర్ఫ్యూ.. ఎక్కడెక్కడంటే.?
Ap curfew
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంబాజీపేట మండలంలో రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుపోతోంది. ఈ నేపధ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అంబాజీపేట మండలంలోని మాచవరం, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, పుల్లేటికుర్రు గ్రామాల్లో వారం రోజుల పాటు కర్ఫ్యూను విధించారు. రేపటి నుంచి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించారు. అవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా రోడ్లపైకి రావద్దని.. ఒకవేళ వస్తే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఏపీ కరోనా అప్డేట్…

ఏపీలో గడచిన 24 గంటల్లో 2,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942కి చేరింది. నిన్న 1,956 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 19,25,631 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,999గా ఉంది. కరోనా బారిన పడి ఇవాళ చనిపోయిన 20 మందితో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 13,312 మంది ప్రాణాలను కోల్పోయారు.

Also Read:

దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..

ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!