AP News: నడి రోడ్డుపై మొసలి కలకలం.. ఉలిక్కిపడ్డ వాహనదారులు

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బైపాస్ రోడ్డుపై మొసలి కలకలం రేపుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారు. స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు రంగంలోకి దిగి మొసలి కోసం గాలింపు చేపట్టారు.

AP News: నడి రోడ్డుపై మొసలి కలకలం.. ఉలిక్కిపడ్డ వాహనదారులు
Crocodile Spotted In Piduguralla Bypass Road

Edited By:

Updated on: Oct 24, 2024 | 12:36 PM

అర్ధరాత్రి సమయం..  పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బైపాస్ రోడ్డుపై వాహనాలు దూసుకుపోతున్నాయి. రోడ్డ పక్కన మొదట ఏదో కదిలినట్లు వాహనదారులకు కనిపించింది. అయితే లారీ డ్రైవర్లు, కార్ల యజమానులు పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. కొద్దిసేపటికే కలకలం రేగింది. ఏకంగా ఒక మొసలి బైపాస్ రోడ్డుపై ప్రత్యక్షమైంది. అటు ఇటు తిరుగుతూ దారిలో పోయే వాహనాలకు అడ్డు వచ్చింది. దీంతో మొదట వాహనదారులు కంగారు పడ్డా ఎవరూ దాన్ని తొక్కించకుండా పక్క నుండి వెళ్లిపోయారు. అయితే స్థానికలు ఈ విషయం తెలుసుకొని వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన అటవీ శాఖాధికారులు మొసలి కోసం గాలింపు చేపట్టారు. అప్పటి వరకూ బైపాస్ పై హల్‌చల్ చేసిన మొసలి కనిపించలేదు.  అటవీ శాఖాధికారులు అర్దరాత్రి సమయంలో ఎంత గాలించిన కనిపించలేదు. అయితే హైవే వంతెన కిందకు వెళ్లిపోయిందని కొంతమంది చెప్పడంతో అటవీ శాఖాధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. తిరిగి ఉదయాన్నే వచ్చిన అటవీ శాఖాధికారులు సమీపంలోని పొలాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించిన మొసలి కనిపించలేదు. అయితే బైపాస్ పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పంట పొలాలుండటంతో అధికారులు మొసలిని పట్టుకునేందుకు ట్రాప్ కేస్ ఏర్పాటు చేశారు. ట్రాప్ కేస్ లో కోడి ఉంచి రెండు రోజుల పాటు వేచి చూస్తామని ఒకవేళ ట్రాప్ కేస్‌లో చిక్కుకుంటే దాన్ని క్రిష్ణా నదిలో వదిలిపెడతామని అధికారులు చెప్పారు.

వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి