గుడ్ న్యూస్…ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో క‌రోనా బాధితుడు డిశ్చార్జ్‌

| Edited By: Pardhasaradhi Peri

Apr 03, 2020 | 1:09 PM

ఓ గుడ్ న్యూస్… తూర్పు గోదావరి జిల్లాలో కరోనా బాధితుడు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందిన ఈ విద్యార్థి లండన్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చాడు.. అయితే ఇతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత రెండుసార్లు వైద్యపరీక్షలు చేయగా… రెండుసార్లూ నెగటివ్‌ వచ్చింది.. దీంతో అతడిని డిశ్చార్జ్‌ చేశారు వైద్యులు. తూర్పు గోదావరి జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు ఇదే! కలెక్టర్‌ […]

గుడ్ న్యూస్...ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో క‌రోనా బాధితుడు డిశ్చార్జ్‌
Follow us on

ఓ గుడ్ న్యూస్… తూర్పు గోదావరి జిల్లాలో కరోనా బాధితుడు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందిన ఈ విద్యార్థి లండన్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చాడు.. అయితే ఇతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత రెండుసార్లు వైద్యపరీక్షలు చేయగా… రెండుసార్లూ నెగటివ్‌ వచ్చింది.. దీంతో అతడిని డిశ్చార్జ్‌ చేశారు వైద్యులు. తూర్పు గోదావరి జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు ఇదే! కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు సమక్షంలో ఇంటికి పంపించారు. అయినప్పటికీ కొన్ని రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని విద్యార్థికి సూచించారు. పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన ఎవరూ భయపడవద్దని…చికిత్స తీసుకుంటే అంతా నయమైపోతుందని చెప్పాడు డిశ్చార్జ్‌ అయిన విద్యార్థి.