ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

Coronavirus Cases In AP: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది...

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!
Coronavirus Cases In AP

Updated on: Mar 31, 2021 | 6:09 PM

Coronavirus Cases In AP: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,964 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 1,184 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. ఇందులో 7338 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,87,434 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7217కు చేరుకుంది. ఇక నిన్న 456 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,50,83,179 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 66, చిత్తూరు 115, తూర్పుగోదావరి 26, గుంటూరు 352, కడప 62, కృష్ణా 113, కర్నూలు 64, నెల్లూరు 78, ప్రకాశం 45, శ్రీకాకుళం 42, విశాఖపట్నం 186, విజయనగరం 19, పశ్చిమ గోదావరి 11 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

Loading...
Unable to load recommendations.
Follow Us