Andhra Pradesh: యువకుడిపై రాయితో దాడి చేసిన కానిస్టేబుల్‌.. పోలీసులకు ఫిర్యాదు

| Edited By: Srilakshmi C

Dec 12, 2023 | 6:20 PM

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అర్ధరాత్రి సబ్జల్ కానిస్టేబుల్ శీను మద్యం మత్తులో హల్చల్ చేశాడు. తన చిన్న కుమారులతో వీధి బయట ఉన్న సురేంద్ర అనే వ్యక్తి పై వెనక నుండి రాయితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన తన తల్లి, భార్య, అత్తలపై సైతం దాడి చేసి గాయపరచాడు. దీంతో కానిస్టేబుల్ శీను నుంచి తనకు, తన కుటుంబానికి..

Andhra Pradesh: యువకుడిపై రాయితో దాడి చేసిన కానిస్టేబుల్‌.. పోలీసులకు ఫిర్యాదు
Constable Attacked On Youth
Follow us on

నంద్యాల, డిసెంబర్ 12: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అర్ధరాత్రి సబ్జల్ కానిస్టేబుల్ శీను మద్యం మత్తులో హల్చల్ చేశాడు. తన చిన్న కుమారులతో వీధి బయట ఉన్న సురేంద్ర అనే వ్యక్తి పై వెనక నుండి రాయితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన తన తల్లి, భార్య, అత్తలపై సైతం దాడి చేసి గాయపరచాడు. దీంతో కానిస్టేబుల్ శీను నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితుడు సురేంద్ర డోన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

తాగిన మైకంలో కాలనీలో ఇష్టానుసారంగా దుర్భాషలాడుతుండగా అలాంటి మాటలు మాట్లాడడం సబబు కాదని అడ్డుకున్నందుకు మనసులో పెట్టుకొని తనపై దాడి చేసి గాయపరిచాడని సురేంద్ర పోలీసులకు తెలిపాడు. అతని నుంచి ప్రాణహాని ఉందని తన, తన కుటుంబాన్ని కాపాడాలని బాధితుడు పోలీసులను వేడుకున్నాడు. సురేంద్ర ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కానిస్టేబుల్ శీనును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దాడి చేయడం హేయమైన చర్యని, ఈ ఘటనపై విచారణ జరిపి కానిస్టేబుల్‌ శీనును సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.