CM Jagan: అండగా నిలుస్తాం..! ఆదుకుంటాం..! ఎవరూ అధైర్యపడొద్దు..! వరద బాధితుల్లో ధైర్యం నింపిన సీఎం..

వరద బాధితులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్. ప్రతి ఒక్కరినీ ఆదకుంటామని చెప్పారు. కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు.

CM Jagan: అండగా నిలుస్తాం..! ఆదుకుంటాం..! ఎవరూ అధైర్యపడొద్దు..! వరద బాధితుల్లో ధైర్యం నింపిన సీఎం..
Cm Jagan

Updated on: Dec 02, 2021 | 7:50 PM

CM Jagan: అండగా నిలుస్తాం..! ఆదుకుంటాం..! ఎవరూ అధైర్యపడొద్దంటూ వరద బాధితుల్లో ధైర్యం నింపారు CM జగన్. ఇళ్లు కోల్పోయిన వారికి 5సెంట్ల స్థలంలో ఇల్లు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు జగన్. వరద బాధితులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్. ప్రతి ఒక్కరినీ ఆదకుంటామని చెప్పారు. కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరులో వరదలకు సర్వం కోల్పోయిన వారిని పరామర్శించారు. 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి రామమూర్తిని ఓదార్చి భరోసా ఇచ్చారు.

ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. పొదుపు సంఘాలకు సాయం, ఉపాధిహామీ పనులు, జాబ్‌మేళా, చదువుకున్న వారికి బ్యాంక్‌ లోన్స్‌ వంటి సహాయకార్యక్రమాలు 10 రోజుల్లోపే చేస్తామని స్పష్టం చేశారు. సహాయక చర్యలపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో పర్యటించారు సీఎం జగన్. వేదలచెరువు, ఎస్టీ కాలనీలో వరదనష్టంపై బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. రేపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..