YSR Raithu Bharosa Funds: శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటిస్తారు. పుట్టపర్తిలో వైసీపీ నిర్వ నిర్వహించే డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సంద్భంగా పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సాయం అందిస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో 52.57 లక్షల మంది రైతులకు 7500 చొప్పున 3వేల942.95 కోట్లను అందించింది. రెండో విడత పెట్టుబడి సాయం కోసం ఒక్కో రైతుకు 4 వేల కోట్లు విడుదల చేయనుంది. మొత్తం 53.53 లక్షల మంది రైతుకు 2204.77 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఐదో ఏడాది రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమచేయనున్నారు.
మరోవైపు సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి. రెయిన్‌గన్‌ల పేరిట సుమారు 500 కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే. మరోవైపు టీడీపీ సైతం ఇవాళ చలో పుట్టపర్తికి పిలుపునిచ్చింది. శ్రీసత్యసాయి జిల్లాలోకి ముఖ్యమంత్రి జగన్‌కు కాలు పెట్టే అర్హత లేదంటూ విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. తాగునీటి కోసం కేటాయించిన నీటిని చిత్తూరు జిల్లాకు తరలిస్తుంటే జిల్లా ఎమ్మెల్యేలు చూస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులకు చెల్లిస్తామన్న నష్టపరిహారం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని తప్పుబట్టారు. దీనికి నిరసనగా చలో పుట్టపర్తికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
అయితే, టీడీపీ చలో పుట్టపర్తికి అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. సీఎం పర్యటను అడ్డుకుంటే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మడకశిరలో నియోజకవర్గంలో కరువు ప్రాంతాలను పరిశీలిస్తున్న టీడీపీ మాజీ మంత్రులను అడ్డుకున్నారు పోలీసులు. పుట్టపర్తి వెళ్లకుండా మడకశిర స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..