జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. లంచాలు, వివక్ష లేని పాలన అందించాం.. చంపితే ఏమవుతుంది అంటూ.. చెడు చేయాలని కొందరు కోరుకుంటున్నారు.. ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారా ? డ్వాక్రా రుణాల బకాయి తీర్చారా ? సూపర్ సిక్స్‌ను నమ్మొచ్చా అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభకు వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన జీవితకాలంలో ఏ రోజు పేదలకు మంచి చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ కొత్త కొత్త మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.
2014లోనూ ఇదే కూటమి ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసిందన్నారు సీఎం జగన్. అయితే వాటిలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదన్నారు.
పేదల భవిష్యత్తు మారాలన్నా.. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా.. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలన్నారు సీఎం జగన్. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలంటే ప్రజలు ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలని కోరారు.
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలని.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలన్నారు సీఎం జగన్. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలన్నారు.
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు.. మీ ఇంటింటి భవిష్యత్, పథకాల కొనసాగింపును.. నిర్ణయించే ఎన్నికలు అంటూ సీఎం జగన్ అన్నారు.
తాము సామాజిక న్యాయం చేసి చూపించామని.. పేదవాడి భవిష్యత్ మారాలి..పథకాలన్నీ కొనసాగాలి.. వైసీపీని గెలిపించాలి.. అంటూ జగన్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..