CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు మీదుగా యాత్ర సాగుతుంది. ఏటూకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ అనంతరం సీఎం జగన్ నంబూరులో రాత్రికి బస చేస్తారు.

CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం..
Jagan Bus Yatra
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 12, 2024 | 12:49 PM

— వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ధూళిపాళ్ల నుంచి ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు జగన్‌. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిశాక తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్‌ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు జగన్‌.

— పదమూడో రోజు సీఎం జగన్‌ బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది..ఇవాళ ధూళిపాళ్ల నుంచి బయలుదేరిన సీఎం…సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటోంది. అక్కడ భోజన విరామం తర్వాత ఏటుకూరు బైపాస్ బహిరంగ సభకు చేరి ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని, వెంగళ్‌ రావు నగర్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గరకు వెళతారు. రాత్రికి నంబూరులోనే బస చేస్తారు సీఎం జగన్.

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి టీడీపీ, బీజేపీకి గుడ్‌బై చెబుతూ, పలువురు నేతలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోత్తకోట ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజను సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి, అలాగే బీజేపీ నుంచి బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్‌ శశికళ, ఏపీ కురవ సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్‌- YCPలో చేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..