16 December 2024
Pic credit - Social Media
TV9 Telugu
హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో పెంచుకోవడం వలన అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
తులసి దగ్గర కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయని .. ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు.
సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. దీంతో తులసి ప్రసన్నం అవుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో సంపదను పొందుతారు.
తులసి మంజరిని ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి ధన, ధాన్యాల నిల్వ నిండుగా ఉంటుంది.
తులసి దగ్గర మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. రెండు మొక్కలు ఒకదాని కొకటి శక్తిని పెంచుతాయి. ఇంట్లో సంపదకు కొత్త మార్గాలు తెరవబడతాయి.
తులసి దగ్గర మట్టి ప్రమిదలో దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి దగ్గర మొక్క దగ్గర అక్షతలు లేదా పసుపు ఉంచడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
తులసి దగ్గర వెండి నాణెం లేదా ఇతర లోహం శుభానికి చిహ్నం. ఇలా చేయడం వలన ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.