CM JAGAN POLAVARAM TOUR: పోలవరం పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ.. ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి…

| Edited By: Pardhasaradhi Peri

Dec 14, 2020 | 4:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం పోలవరం వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత పోలవరం..

CM JAGAN POLAVARAM TOUR: పోలవరం పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ.. ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి...
Follow us on

CM JAGAN POLAVARAM TOUR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం పోలవరం వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఆ తరువాత ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు పనుల జరుగుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తరువాత స్పిల్ వే వద్దకు చేరుకుని పనుల పురోగతిని సీఎం జగన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. 2022 ఖరీఫ్ నాటిని పోలవరం నుండి నీటిని అందిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి పునరావాసం అమలు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్, పేర్నినాని, ఇతర నేతలు ఉన్నారు.

ఇదిలాఉండగా, పోలవరం ప్రాజెక్టును 2022 ఖరీఫ్ కల్లా నీల్లు ఇచ్చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. గత ఏడాది జూన్‌లో తొలిసారి సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన రెండోసారి పర్యటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు స్వయంగా సైట్ వద్దకు వచ్చిన సీఎం జగన్.. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు.

Also Read:

మళ్లీ టాటాల చేతిలోకే… ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా సన్స్ బిడ్… 67 ఏళ్ల తర్వాత మళ్లీ….

సైబ‌ర్ నేర‌గాళ్లు: త్వరలో రాబోయే పబ్‌జీ గేమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త