సైబ‌ర్ నేర‌గాళ్లు: త్వరలో రాబోయే పబ్‌జీ గేమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త

త్వరలో రాబోయే పబ్‌జీ మొబైల్ గేమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త ఉండాలంటున్నారు టెక్ నిపుణులు. పబ్‌జీ గేమ్ ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు..

సైబ‌ర్ నేర‌గాళ్లు: త్వరలో రాబోయే పబ్‌జీ గేమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త
Follow us

|

Updated on: Dec 14, 2020 | 11:15 AM

త్వరలో రాబోయే పబ్‌జీ మొబైల్ గేమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త ఉండాలంటున్నారు టెక్ నిపుణులు. పబ్‌జీ గేమ్ ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుుతున్నారు. ఇలాంటి నేరగాళ్లపై ఇప్పటికే పోలీసులు గట్టి నిఘా కూడా పెట్టారు. ఎందుకంటే దీనికి సంబంధించి నకిలీ ఏపీకే లింకులు ఇంటర్నెట్లో హల్ హల్ చేస్తున్నాయి. అలాంటి లింకులను పొరపాటున క్లిక్ చేసినట్లయితే సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లేనని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ న‌కిలీ ఏపీకే లింకుల‌ను నిపుణులు గుర్తించారు.

అయితే దేశ భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ పబ్‌జీ ఆటను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ గేమ్ వ‌ల్ల మాన‌సికంగా దెబ్బ‌తిన‌డం, మ‌ర‌ణించ‌డం ఎన్నో జ‌రిగాయి. ఈ గేమ్‌ను నిషేధించాలంటూ చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండ‌గా, చైనాకు సంబంధించిన యాప్‌ల‌తో పాటు ఈ ప‌బ్‌జీ గేమ్‌ను సైతం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్ వెర్షన్ లోనే పబ్ జీ మొబైల్ గేమ్ ను తీసుకురానున్నట్లు పబ్ జీ ఇండియా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. తమకు ఎంతో ఇష్టమైన గేమ్ మళ్లీ రాబోతోందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు నకిలీ ఏపీకే లింకులతో పబ్ జీ ప్రియులపై వల వేస్తున్నారు. పొరపాటున ఎవరైనా అలాంటి లింకులపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేస్తే మీ వివైజ్ ను వారు హ్యా్క్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ ఫైల్స్ ద్వారా డివైజ్ లోకి మాల్ వేర్ను పంపించి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటి లింకుల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.