వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్(CM Jagan) .. ఒంగోలు(Ongole) లో ప్రారంభించునున్నారు. నగదును డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. 9.76 లక్షల డ్వాక్రా సంఘాల్లో 1.02 కోట్ల మంది మహిళలకు మూడో విడత ద్వారా లాభం చేకూరనుంది. వీరి కోసం రూ.1,261 కోట్లు విడుదల చేయనున్నారు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం నిధులు విడుదల చేస్తారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరుతారు. పది గంటలకు ఒంగోలు చేరుకుని, పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభిస్తారు.
సున్నావడ్డీ పథకం మూడో విడత అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఒంగోలులో పర్యటిస్తారు. వ్యాపారవేత్త కంది రవిశంకర్ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఆందోళన చేసే అవకాశం ఉందన్న అనుమానంతో వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!
కంబళ వీరుడి కొత్త రికార్డు.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజనం.. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..
Rashmika Mandanna: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న నేషనల్ క్రష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్