Andhra Pradesh: టికెట్ కన్ఫామా..? లేదా..? మూడో జాబితాపై ఎమ్మెల్యేల్లో టెన్షన్.. తాడేపల్లికి క్యూ కట్టిన నేతలు..

|

Jan 05, 2024 | 6:42 PM

వై నాట్ 175.. ఈ టార్గెట్‌ను రీచ్ కావాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేల పనితీరుపై వేర్వేరుగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను మారుస్తోంది. దీనికోసం సుధీర్గ కసరత్తులు చేస్తున్నారు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత సీఎం జగన్.. సామాజిక అంశాలు, బలం, బలగం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జులను ప్రకటిస్తున్నారు.

Andhra Pradesh: టికెట్ కన్ఫామా..? లేదా..? మూడో జాబితాపై ఎమ్మెల్యేల్లో టెన్షన్.. తాడేపల్లికి క్యూ కట్టిన నేతలు..
Ys Jagan
Follow us on

వై నాట్ 175.. ఈ టార్గెట్‌ను రీచ్ కావాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేల పనితీరుపై వేర్వేరుగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను మారుస్తోంది. దీనికోసం సుధీర్గ కసరత్తులు చేస్తున్నారు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత సీఎం జగన్.. సామాజిక అంశాలు, బలం, బలగం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జులను ప్రకటిస్తున్నారు. మొదటి విడతలో 11 మంది.. రెండో విడతలో 27 మంది ఇన్‌ఛార్జులను ప్రకటించిన సీఎం జగన్.. మూడో విడతపై దృష్టిసారించారు. వైసీపీలో మార్పులు-చేర్పులపై తాడేపల్లి కేంద్రంగా కసరత్తు చేస్తున్నారు.

తొలి, రెండవ జాబితాలతోనే ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన వైసీపీ అధిష్టానం.. థర్డ్ లిస్టుపై కూడా కసరత్తును వేగవంతం చేసింది. ఇవాళ కూడా నియోజకవర్గాల వారీగా మార్పులు-చేర్పులపై మంతనాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల రాకతో సీఎం క్యాంపాఫీసు సందడిగా మారింది. మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి క్యాంపాఫీసు దగ్గర కనిపించారు. పోటీలో ఉండబోనని ఇప్పటికే తేల్చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సీఎం జగన్ ను కలవడానికి వచ్చారు.

సుధీర్ఘ చర్చల తర్వాత రేపటిలోగా మూడో విడత ఇన్‌చార్జ్‌ల తుది జాబితా వెలువడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మూడో లిస్ట్‌లో 10 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్‌ ఉందని ప్రచారం జరగుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..