CM Jagan: వైఎస్‌ఆర్‌కు సీఎం జగన్ నివాళులు.. ‘నాన్నా, మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’ అంటూ..

|

Sep 02, 2023 | 1:19 PM

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి, తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇక తన వెంట తండ్రి లేని లోటును గుర్తు చేసుకున్న వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. సీఎం జగన్ తన ట్వీట్‌లో ‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది..

CM Jagan: వైఎస్‌ఆర్‌కు సీఎం జగన్ నివాళులు.. ‘నాన్నా, మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’ అంటూ..
CM Jagan
Follow us on

పులివెందుల, సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ దివంగత రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, విభాజిత ఏపీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి, తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇక తన వెంట తండ్రి లేని లోటును గుర్తు చేసుకున్న వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. సీఎం జగన్ తన ట్వీట్‌లో ‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా’ అంటూ రాసుకొచ్చారు. 

సీఎం జగన్ ఇడుపులపాయకు రాకముందే అక్కడకు చేరుకున్న ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తన తండ్రికి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర్ భార్య, తన తల్లి విజయమ్మతో  కలిసి ఇడుపులపాయకు వెళ్లిన ఆమె, అక్కడ నివాళులు అర్పించి, ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తన తండ్రి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు షర్మిల.


కాగా, సీఎం జగన్ తన తండ్రికి నివాళులు అర్పించిన తర్వాత.. ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అలాగే శనివారం రాత్రి 9:30 గంటలకు సీఎం జగన్-భారతి దంపతులు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. లండన్‌లో చదువుతున్న తమ పిల్లలను కలిగిసేందుకు వెళ్తున్న వారిద్దరు సెప్టెంబర్ 12న తిరిగి వస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..