Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్.. డిసెంబర్‌ 18 నుంచి..

|

Dec 05, 2023 | 9:58 AM

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ఈ నెల 18 నుంచి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సోమవారం సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు, మందుల కొరత కూడా లేకుండా...

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్.. డిసెంబర్‌ 18 నుంచి..
Cm Jagan Mohan Reddy
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త తెలిపారు. పేదల వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో మరో ముందడుగు వేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నామని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ఈ నెల 18 నుంచి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సోమవారం సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు, మందుల కొరత కూడా లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సీఎం సూచించారు.

ఇక పెద్ద మొత్తంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నందున ముద్రణ కొనసాగుతోందని, ఇది వరకే ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారంతో బ్రోచర్లు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశను ప్రారంభించనున్నారు. ప్రతీ మండలంలో ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

2023-24లో నవంబరు నెలాఖరు నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని, ఇది గత ఏడాది కంటే 24.64 శాతం అధికమని అధికారులు తెలిపారు. అలాగే.. ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న హెచ్‌9ఎన్‌2 వైరస్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ఈసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..