Andhra Pradesh: ఏపీలో మరో పథకానికి శ్రీకారం.. సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మరో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పశుపోషకుల ఇంటి వద్దే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్సార్ సంచార సంచార పశు ఆరోగ్యసేవల కోసం....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మరో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పశుపోషకుల ఇంటి వద్దే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్సార్ సంచార సంచార పశు ఆరోగ్యసేవల కోసం 340 పశువుల అంబులెన్సులు ఏర్పాటు చేసింది. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(CM.Jagan) జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతగా 143 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 175 పశు అంబులెన్సులను సీఎం జగన్ ప్రారంభించారు. రెండో దశలో 135 కోట్ల రూపాయలతో మరో 165 అంబులెన్సులు ఏర్పాటు కానున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండు పశు అంబులెన్సులను అందుబాటులో ఉంచనున్నారు. 108 సేవల మాదిరిగానే వీటిలోనూ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు. 1962కు కాల్ చేస్తే పశువుల అంబులెన్సులు పశుపోషకుల ఇంటి వద్దకే వస్తాయి. సత్వరమే స్పందించి పశువులకు కావాల్సిన చికిత్స అందిస్తాయి. ఒకవేళ మెరుగైన వైద్యం కావాల్సి వస్తే దగ్గర్లోని ఏరియా పశు వైద్యశాలకు తరలిస్తారు. మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు.
పశు అంబులెన్స్ లో ఒక పశు వైద్యుడు, వెటర్నరి డిప్లొమా చేసినా అసిస్టెంట్, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అన్ని రకాల టీకాలు, మందులతో పాటు పశువులను వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం అంబులెన్సులో ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Gyanvapi Masjid Case: రేపటి వరకూ విచారణ ఆపివేయండి.. జ్ఞానవాపి కేసు విచారణకు సుప్రీం కోర్టు బ్రేక్..