Andhra Pradesh: రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం..2022-23 రుణ ప్రణాళిక లక్ష్యాలపై సమీక్ష

|

Mar 10, 2023 | 10:09 PM

ఏపీలో విద్య, గృహ‌నిర్మాణ రంగాల్లో బ్యాంకర్లు నిర్దేశిత రుణ ల‌క్ష్యాల‌ను చేరుకోలేక పోవడం పట్ల సీఎం జ‌గ‌న్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మ‌హిళ‌లు రైతుల‌కు మ‌రిన్ని రుణాలివ్వాలని, పారిశ్రామిక‌వేత్తల‌ను ప్రోత్సహించేలా స‌హ‌క‌రించాల‌ని స్టేట్ లెవల్ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశంలో సీఎం జగన్ బ్యాంక‌ర్లను కోరారు.

Andhra Pradesh: రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం..2022-23 రుణ ప్రణాళిక లక్ష్యాలపై సమీక్ష
Cm Jagan
Follow us on

222వ రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం సీఎం జ‌గ‌న్ అధ్యక్షతన క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో గ‌తేడాది రుణ ప్రణాళిక ల‌క్ష్యాలు-సాధ‌న పై ఎస్ ఎల్ బీసీ వివ‌రాలు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించింద‌న్నారు సీఎం. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందన్నారు. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా బాగుంద‌ని అయితే మ‌రికొన్ని కీల‌క రంగాల‌కు మ‌రింత ప్రోత్సాహం అవ‌స‌రం అన్నారు సీఎ జగన్. విద్యారంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని… సామాజిక,ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని ఈ రెండు రంగాల పట్ల మరింత సానుకూల దృక్పథంతో బ్యాంకులు ముంద‌డుగు వేయాల‌ని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో 83.36శాతం మాత్రమే ల‌క్ష్యం చేరుకున్నారని ఈ రంగంపై ఎస్ ఎల్ బీసీ దృష్టి సారించాల‌న్నారు.

కౌలు రైతులకు రుణాలకు సంబంధించి డిసెంబర్‌ 2022 వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించిన‌ట్లు సీఎం చెప్పారు..డ్వాక్రా గ్రూపుల‌కు ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో బ్యాంకులు మరోసారి ఆలోచన చేయాలని ఆయన కోరారు…నాబార్డు, బ్యాంకులు డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు..MSME ల‌పై బ్యాంకింగ్‌ రంగం మరింత శ్రద్ధ వహించాలని సీఎం బ్యాంకర్లను కోరారు.

ద్వారా దాదాపు 13ల‌క్షల కోట్లపెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం . ఈ పెట్టుబడులు పెట్టేందుకు రుణాల లభ్యత చాలా ముఖ్యమైనదని…అనుబంధ యూనిట్లకు అవసరమైన మద్దతును కూడా బ్యాంకింగ్ రంగం అందించాల‌ని సీఎం కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..