CM Jagan: సీఎం సార్‌ మంచి మనసు.. వైద్యం కోసం అల్లాడుతున్న చిన్నారులకు జగన్‌ ఆపన్నహస్తం

|

Mar 20, 2023 | 8:37 AM

ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలనలో బిజీగా ఉన్నప్పటికీ సాయం విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు జగన్మోహన్‌ రెడ్డి. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా తిరువూరు పర్యటనలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సీఎం జగన్.

CM Jagan: సీఎం సార్‌ మంచి మనసు.. వైద్యం కోసం అల్లాడుతున్న చిన్నారులకు జగన్‌ ఆపన్నహస్తం
Cm Jagan
Follow us on

ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలనలో బిజీగా ఉన్నప్పటికీ సాయం విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు జగన్మోహన్‌ రెడ్డి. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా తిరువూరు పర్యటనలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సీఎం జగన్. అంతుచిక్కని అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఇద్దరు చిన్నారుల వైద్యానికి సాయం అందించారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్ పేట గ్రామంలో నివాసం ఉంటూ పెయింటర్‌గా గాదే సురేష్ – గాయత్రి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఇద్దరు వేదశ్రీ దుర్గ (12) లాస్య ప్రియ(8) పుట్టుకతోనే అంతు పట్టని వ్యాధితో (కంజెనిటికల్ మైస్తేనియా సిండ్రోమ్) బాధపడుతున్నారు. ఖమ్మం, విజయవాడ నగరాల్లోని ఎన్నో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌కు వెళ్లినా చిన్నారులకు సరైన వైద్యం దొరకలేదు. దీనికి తోడు పేదరికం కారణంగా వేలకు వేలు ఖర్చుపెట్టడం సురేశ్‌ దంపతులకు భారంగా మారింది. ఆ తర్వాత రెయిన్ బో చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చూపిస్తే.. వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలన లేదు కానీ మందులతో కంట్రోల్ చేయవచ్చన్నారు. ఇందుకోసం ఇంజెక్షన్లు, మందులు వాడాలని సూచించారు. కాగా వీటి కోసం ఇద్దరు పిల్లలకు కలిపి నెలకు రూ.30 నుంచి 40 వేలు అవుతోంది. ఇది పిల్లల తల్లిదండ్రులకు భారంగా మారింది. ఈ విషయాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ద్వారా వారు తిరువూరులో సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు పిల్లల తల్లిదండ్రలు.

 

తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న జగన్‌ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణ సాయంగా కలెక్టర్‌ వారికి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఇక బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తమ కుమారుడు మారిపోగు రంజిత్‌(13)ను ఆదుకోవాలని తిరువూరు మండలానికి చెందిన మారిపోగు శ్రీను, వెంకట్రావమ్మ దంపతులు తిరువూరులో సీఎం వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. పేరెంట్స్‌ విజ్ఞప్తిని ఓపికగా విన్న సీఎం రంజిత్‌ కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాలుడి వైద్య ఖర్చులకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు రూ.లక్ష చెక్కు తల్లిదండ్రులకు అందజేశారు. ఇలా అడిగిన వెంటనే చిన్నారుల వైద్యానికి సాయమందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు పిల్లల తల్లిదండ్రులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి