AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం..
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ.. ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీల కేటగిరీ కింద 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ.. ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీల కేటగిరీ కింద 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ లేదా మైక్రోబయాలజీ/పాథాలజీ/పారాసిటాలజీ/ఎపిడెమియాలజీ/వైరాలజీ/ఇమ్యునోలజీ/బయో కెమిస్ట్రీ/వెటర్నిటీ పబ్లిక్ హెల్త్‌లో పోస్టుగ్రాడ్యయేషన్ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 20, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.54,060ల నుంచి రూ.1,40,540 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The Director of Animal Husbandry Department, NTR VSSH Campus, Labbipeta, Andhra Pradesh, Vijayawada – 520010.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.