CM Jagan: నేడు రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

|

May 09, 2024 | 7:56 AM

ఒక్కరోజు బ్రేక్‌ తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు సీఎం జగన్‌. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. సీఎం జగన్‎తో పాటూ ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నాయి. అయితే ఎన్నికల ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈరోజు నుంచి ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలోనే సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించారు సీఎం జగన్. అందులో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

CM Jagan: నేడు రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Cm Jagan
Follow us on

ఒక్కరోజు బ్రేక్‌ తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు సీఎం జగన్‌. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. సీఎం జగన్‎తో పాటూ ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నాయి. అయితే ఎన్నికల ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈరోజు నుంచి ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలోనే సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించారు సీఎం జగన్. అందులో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ మూడు నియోజకవర్గాలు రాయలసీమ పరిధిలోనివి కావడం విశేషం. కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేటలో రోడ్ షోలు నిర్వహించి 59 నెలల కాలంలో తమ ప్రభుత్వంలో చేసిన మంచి గురించి వివరించనున్నారు. ఏపీలో సీఎం జగన్‌ అయితే ముందు నుంచే ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఇవాళ మూడు సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. మే 9న ఉదయం 10 గంటలకు కర్నూలు సిటీలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎస్వీ కాంప్లెక్స్‌ రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలీకాఫ్టర్‎లో మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం చేరుకుంటారు. స్థానికంగా ఉండే కొల్లపురమ్మ టెంపుల్‌ రోడ్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం అక్కడే భోజన విరామం తీసుకుని తిరిగి అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణదుర్గం నుంచి రైల్వే కోడూరు చేరుకుంటారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైల్వేకోడూరు మెయిన్ రోడ్‌లో జరిగే ప్రచారంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఇక, సిద్దం నుంచి మేమంతా సిద్దం బస్సుయాత్రల వరకు సీఎం జగన్‌ ప్రసంగాలకు జనం నుంచి సూపర్‌ రియాక్షన్‌ వచ్చింది. మేమంతా సిద్దం బస్సుయాత్ర తరువాత చేపట్టిన నియోజకవర్గాల సుడిగాలి పర్యటనలకు కూడా విశేష ఆదరణ లభిస్తోంది. మొన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఈరోజు మరో ఎత్తు అని చెప్పాలి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. ఈ తరుణంలో నేటి మూడు సభలు ఇదే రాయలసీమ జోన్ లోని నియోజకవర్గాలు కావడంతో మరింత ఎక్కువ ప్రజాధరణ ఉండే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని పదేపదే చెప్తున్నారు జగన్. పొరపాటున బాబును నమ్మితే మోసపోతారంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు. అయితే ఈరోజు ఏ అంశంపై ప్రసంగిస్తారన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..