CM Jagan: విద్యాశాఖపై జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ.

|

Jun 09, 2023 | 6:39 AM

వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి స్కూల్స్ పునర్ ప్రారంభం మీదే ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌... అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు...

CM Jagan: విద్యాశాఖపై జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ.
CM Jagan
Follow us on

వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి స్కూల్స్ పునర్ ప్రారంభం మీదే ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌… అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరు, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ విద్యాశాఖ కు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని, వచ్చే జూన్‌ నాటికి జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి దశ నాడు-నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఆరో తరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై కూడా సీఎం సమీక్షించారు. ట్యాబ్‌ల వినియోగం, అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపై రివ్యూ చేశారు. స్కూళ్లలో ఇంటర్న్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామని, ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని సీఎం అన్నారు. డ్రాప్‌అవుట్స్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అకడమిక్‌ క్యాలెండర్‌ 2023-24ను సీఎం జగన్ విడుదల చేశారు.

మరోవైపు ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై క్లారిటీ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జూన్ 12 నుంచి స్కూళ్లలో తరగతులు పునర్‌ ప్రారంభం అవుతాయని వెల్లడించారు.. అంతేకాదు. జూన్ 12 నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్ల పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో కిట్ కోసం ప్రభుత్వం రూ. 2500 ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇక పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..