YSRCP: అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

ఎమ్మిగనూరు సీఎం జగన్ బస్సుయాత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆయన్ను చూసేందుకు వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో పేషెంటు ఉన్న అంబులెన్స్ అటుగా వచ్చింది.

YSRCP: అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
Cm Jagnan Ambulance

Updated on: Mar 29, 2024 | 3:09 PM

ఎమ్మిగనూరు సీఎం జగన్ బస్సుయాత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆయన్ను చూసేందుకు వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో పేషెంటు ఉన్న అంబులెన్స్ అటుగా వచ్చింది. అయితే అంతమంది ప్రజల్లో ఎక్కడా చిక్కుకోకుండా ముందుకు సాగిపోయింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ప్రచారంలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సుయాత్ర ప్రొద్దుటూరు మీదుగా కర్నూలు జిల్లాకు చేరుకుంది.

ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలోనే బస్సు యాత్ర నంద్యాల తరువాత కోడుమూరు చేరుకుంది. అదే సమయంలో అటుగా వస్తున్న అంబులెన్స్‎కు సీఎం జగన్ కాన్వాయ్ దారిచ్చింది. జగన్ కాన్వాయ్ చుట్టూ వందలాది మంది ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సమయంలో అంబులెన్స్‎కు దారి ఇవ్వడం అంటే చాలా కష్టంతో కూడుకున్నపని. అలాంటిది అక్కడి పోలీసు, సీఎం జగన్ ప్రత్యేక భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‎కు దారిచ్చారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అంబులెన్స్ ముందుకు సాగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…