CM Jagan: గడప గడపకూ మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష.. ఆ 20 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీరియస్
రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించిన సీఎం కొందరి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి 13) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలోని కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించిన సీఎం కొందరి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కుబడిగా పనిచేస్తున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 3-4 రోజుల పాటు గ్రామాల్లో తిరగడం సరికాదంటూ క్లాస్ పీకారు. జగన్ ఆగ్రహానికి గురైన 20 మంది ఎమ్మెల్యేల్లో బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలినాని, సామినేని ఉదయబాను, వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు.
‘ మనం దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నాం. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. దాదాపు 1.65 కోట్ల గృహాలను గృహ సారథులు సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ను విజయవంతం చేయండి. అలాగే గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..