CM Chandrababu: రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సందర్శించే ప్రాంతాలివే..

|

Jun 19, 2024 | 7:22 PM

అమరావతి రాజధాని ప్రాంతంలో జూన్ 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా ఐదు సంక్షేమ పథకాలపై తొలి సంతకాలు చేసి అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి పర్యటన ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరంపై ఫోకస్ పెట్టారు.

CM Chandrababu: రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సందర్శించే ప్రాంతాలివే..
Cm Chandrababu Naidu
Follow us on

అమరావతి, జూన్ 19: అమరావతి రాజధాని ప్రాంతంలో జూన్ 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా ఐదు సంక్షేమ పథకాలపై తొలి సంతకాలు చేసి అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి పర్యటన ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరంపై ఫోకస్ పెట్టారు. అక్కడి పరిస్థితులను, ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇక మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఆంధ్రా రాజధాని అమరావతిపై దృష్టి సారించారు. ప్రపంచ దేశాల్లో తలదన్నే రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించారు. అందుకోసం జూన్ 20న గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరనున్నారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్‎లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..