Chandrababu: ప్రతిపక్షంలోకి వెళ్లడానికి సిద్ధంగా లేము.. రౌడీయిజం చేస్తామంటే తాట తీస్తా.. ఇక్కడుంది CBN..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని, బీసీలు, మహిళల కోసం సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్ళదని స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని, రాష్ట్రంలో రౌడీయిజం చేస్తే ఊరుకోమని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.

Chandrababu: ప్రతిపక్షంలోకి వెళ్లడానికి సిద్ధంగా లేము.. రౌడీయిజం చేస్తామంటే తాట తీస్తా.. ఇక్కడుంది CBN..
CM Chandrababu

Updated on: Jan 18, 2026 | 7:37 PM

తెలుగు దేశం పార్టీ (TDP) వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్‌కి భారతరత్న పురస్కారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌ పనిచేశారని.. ఆయన అత్యున్నత పురస్కారం దక్కాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎన్టీర్ పాలనలో బడుగులు, మహిళల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు తెలిపారు.

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించారని అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ పాలనలో బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు.

మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. NTRకి భారతరత్న పురస్కారం తెలుగు ప్రజల ఆకాంక్ష అని కచ్చితంగా భారతరత్న కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చంద్రబాబు వివరించారు.

మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లడానికి TDP సిద్ధంగా లేదని, తాను అధికారంలో కొనసాగి ఉంటే అభిృద్దిలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ పార్టీల ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని.. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకోమని సీఎం వార్నింగ్ ఇచ్చారు.

కక్ష సాధించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని..ఈ రాష్ట్రం ఏమవుతుందన్న వాళ్లకు 18 నెలల్లో మంచి ప్రభుత్వంతో సమాధానం చెప్పామని చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..