Andhra Pradesh: ప్రాణాలు తీస్తున్న గుండెపోటు.. హాస్టల్‌లో ఉన్నట్టుండి కుప్పకూలిన 8వ తరగతి విద్యార్థి.. పాపం చివరికి..

|

Apr 16, 2023 | 3:03 PM

గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. వయసుతో సంబంధం లేకుండా మహమ్మారి దాడి చేసి.. కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. నవ్వుతూ మాట్లాడేవారే.. నిమిషాల్లోనే కన్నుమూస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Andhra Pradesh: ప్రాణాలు తీస్తున్న గుండెపోటు.. హాస్టల్‌లో ఉన్నట్టుండి కుప్పకూలిన 8వ తరగతి విద్యార్థి.. పాపం చివరికి..
Heart Attack
Follow us on

గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. వయసుతో సంబంధం లేకుండా మహమ్మారి దాడి చేసి.. కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. నవ్వుతూ మాట్లాడేవారే.. నిమిషాల్లోనే కన్నుమూస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న హార్ట్ ఎటాక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా.. ఓ 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న కోటి స్వాములు అనే 13 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఊపిరాడటం లేదని స్నేహితులతో చెప్పాడు. అనంతరం కాసేపటికే కింద పడిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు.. వార్డెన్ కు సమాచారమిచ్చారు. హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కోటి స్వాములు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..