Andhra Pradesh: మరింత ముదిరిన ‘జాకీ’ రగడ.. భౌతిక దాడుల వరకు వెళ్లిన మాటల యుద్ధం..

|

Nov 27, 2022 | 10:28 AM

Andhra Pradesh: శ్రీసత్య సాయి జిల్లా జాకీ రగడ రాజుకుంది. వారం రోజులుగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Andhra Pradesh: మరింత ముదిరిన ‘జాకీ’ రగడ.. భౌతిక దాడుల వరకు వెళ్లిన మాటల యుద్ధం..
Tdp Vs Ycp
Follow us on

శ్రీసత్య సాయి జిల్లా జాకీ రగడ రాజుకుంది. వారం రోజులుగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర దూషణలు భౌతికదాడుల వరకు వెళ్లాయి. చంద్రబాబు, లోకేష్‌తో పాటు టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు. ఆయన వ్యాఖ్యలపై టిడిపి నేత ఘంటాపురం జగ్గు సైతం అదే స్థాయిలో అటాక్ చేశారు.

ఈ క్రమంలో జగ్గును చెన్నే కొత్తపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గు కోసం చెన్నే కొత్తపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా టిడిపి నేతలపై దాడి జరిగింది. ఇది కనగానపల్లి వైసీపీ నేతల పని అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధర్మవరం సమీపంలో వాహనాన్ని ధ్వంసం చేసి అమర్నాథ్ రెడ్డి అనుచరులు చితకబాదారు. దాడిలో టిడిపి నాయకులు గాయపడగా.. ప్రస్తుతం గంటాపురం జగ్గు పోలీసుల అదుపులో ఉన్నాడు.

అంతకు ముందు జాకీ కంపెనీ అంశంపైనే పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య మాట యుద్ధం జరిగింది. ప్రకాశ్ రెడ్డి బెదిరింపుల వల్లే జాకీ కంపెనీ తెలంగాణకు తరలి వెళ్లిందంటూ మాజీ మంత్రి పరిటా సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే తోపుదుర్తి. సునీత ఆరోపణలు నిజం లేదన్నారు. టీడీపీ హాయంలో మాదిరిగా కంపెనీ పేరుతో తాము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం లేదని వ్యాఖ్యానించారు. అభూత కల్పనలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. అలా ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య భౌతిక దాడుల వరకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..