AP News: బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం

జాకెట్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో జాకెట్ కోసం రెండు కుటుంబాలు తలలలు పగిలేటట్టు కొట్టుకున్నారు. సుంకులమ్మ అనే మహిళ ఉతికి ఆరేసిన తన నాలుగు జాకెట్లు కనిపించకపోవడంతో వెతకటం..

AP News: బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
Clash Over Blouse In Anantapur

Edited By:

Updated on: Mar 19, 2026 | 6:49 PM

అనంతపురం, మార్చి 19: జాకెట్ కోసం ఇరుగుపొరుగు వాళ్ళు తలలు పగిలేటట్టు కొట్టుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా??? ఎస్… నిజంగానే జరిగింది. జాకెట్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో జాకెట్ కోసం రెండు కుటుంబాలు తలలలు పగిలేటట్టు కొట్టుకున్నారు. సుంకులమ్మ అనే మహిళ ఉతికి ఆరేసిన తన నాలుగు జాకెట్లు కనిపించకపోవడంతో వెతకటం మొదలుపెట్టింది. తన జాకెట్లు పక్కింట్లో ఉంటున్న శాంతమ్మ నందిని వద్ద కనిపించడంతో గొడవ మొదలైంది.

కాసేపటికి సుంకులమ్మ సోదరులైన లక్ష్మణ్ రాములు అక్కడికి వచ్చి.. పక్కింటి శాంతమ్మ నందినితో గొడవపడ్డారు. అలా మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మరి కాసేపటికి పక్కింటి శాంతమ్మ, నందిని తరపున కుటుంబ సభ్యులైన చిన్నవీరప్ప, ఉరుకుందు, చిన్ని, వంశీ, సుంకులమ్మ, ఆమె సోదరులైన లక్ష్మణ్, రాముపై కర్రలు ఇనుపరాట్లతో దాడి చేశారు. దాడిలో లక్ష్మణ్, రాము తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇరు కుటుంబాలు ఘటనపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. జాకెట్ ఎంత పని చేసింది? సుంకులమ్మ ఆరేసిన జాకెట్లు… గాలికి పక్కింటి శాంతమ్మ ఇంట్లో పడడం ఏంటి??? ఆ జాకెట్ల కోసం ఇరుగింటి పొరుగు ఇంట్లో ఉంటున్న ఆ రెండు కుటుంబాలు తలలు పగలేటట్లు కొట్టుకోవడం ఏంటి??? అనుకుంటున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us