బ్రిటిష్ ఇంజనీర్ కాటన్ దొర పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి ఉభయ గోదావరి జిల్లాలను ఎంతో మేలు చేశాడని చాలామంది చెబుతారు. కొంతమంది అయితే ఆయన్ను విపరీతంగా అభిమానిస్తారు. తెల్లవాడు అయితే ఏంది ఆయన మనసు కల్మషం లేనిది అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా గోదావరి ప్రాంత ప్రజలు అయితే ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించిన కాటన్ దొరపై ఎంతో అభిమానం ప్రదర్శిస్తారు. అలాంటి కాటన్ దొర కారణంగా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో వర్గ పోరు ప్రారంభమైంది. ఆయన విగ్రహాన్ని తొలగించాలని ఓ వర్గం.. కుదరదని మరో వర్గం వాదులాటకు దిగడంతో ఏకంగా ఉండాల్సిన ఊరు రెండుగా చీలిపోయింది. ఇరువర్గాలు మాటల యుద్ధానికి దిగడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండువర్గాలు గొడవ పడుతున్నాయని సమాచారం రావడంతో పోలీసులు భారీగా గ్రామానికి చేరుకున్నారు. కాకినాడ రూరల్, తిమ్మాపురం, కరప, పెదపూడి ఎస్సైలు ఉండూరు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాటన్ దొర విగ్రహం పెట్టడంపై ఆ ఊరిలో ఎవరికీ ప్రాబ్లం లేదు, కేవలం ఆ విగ్రహం పెట్టే ప్లేసు గురించి ఆ ఘర్షణ అంతా. ఆ ప్లేసులో వద్దని కొందరు, లేదు అక్కడే విగ్రహం పెట్టాలని కొందరు పట్టుబట్టడంతో ఈ వివాదం రాజుకుంది. ప్రస్తుతం పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగినట్టు తెలుస్తోంది.
Also Raed: టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.