Tomato Price: పెరుగుతున్న దిగుబడి.. పతనమైన టమాటా ధర.. కిలో రూ.5 కంటే తక్కువ.. ఆందోళనలో రైతులు

|

Jul 31, 2022 | 10:15 AM

టమాటా ధర కనిష్టానికి చేరుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు పంట చేతికి వస్తున్న సమయంలో దారుణంగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tomato Price: పెరుగుతున్న దిగుబడి.. పతనమైన టమాటా ధర.. కిలో రూ.5 కంటే తక్కువ.. ఆందోళనలో రైతులు
Tomatoes Theft
Follow us on

Tomato Price: వేసవి ఎండలు, భారీ వర్షాలు, వరదలతో నిన్నా మొన్నటి వరకూ టమాటా ధర రూ.100 లకు పైగానే ఉండేది. అయితే గత 20 రోజులుగా టమాటా ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 5 కన్నా తక్కువగా ఉంది. సాగు విస్తీర్ణం తగ్గినా.. పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తుండటమే దీనికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  టమాటా ధర కనిష్టానికి చేరుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు పంట చేతికి వస్తున్న సమయంలో దారుణంగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర పతనమవుతుండటంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. గత నెలలో కొండెక్కిన కూరగాయల ధరలు ప్రస్తుతం దిగి వచ్చాయి.

మరోవైపు చిత్తూరు జిల్లాలోని మార్కెట్ లో కిలో టమోటా కనిష్టానికి చేరుకుంది. కిలో రూ. 5 లు పలుకుతుండడంతో.. కూలీలకు, రవాణా ఖర్చులకు రావడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే చేతికి వచ్చిన టమాటాలు పొలాల్లోనే టమోటా వదిలేస్తున్నామని చెబుతున్నారు. టమోటా దేశవ్యాప్తంగా మదనపల్లి మార్కెట్‌ నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. ఈ నేపథ్యంలో మదనపల్లి మార్కెట్ కు  989 మెట్రిక్ టన్నుల టమోటా వచ్చింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ట్రేడర్ లు రాకపోవడంతో ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో టమోటాకు తగ్గిన డిమాండ్ తగ్గింది. దీనికి కారణం.. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోనూ టమోటా సాగు చేస్తున్నారు.. అక్కడ కూడా దిగుబడి మొదలవడంతో..  మదనపల్లి మార్కెట్ కు వ్యాపారస్తులు రావడం లేదని.. దీంతో  ఈసారి పరిస్థితి మారిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..