Andhra: ఫ్రెండ్‌ను చంపి రక్త చరిత్ర సాంగ్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన యువకుడి హత్య కలకలం రేపింది. తులసినాయనపల్లి సమీపంలో యువకుడు అనుమానాస్పద మృతి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి తిమ్మరాజుపల్లికి చెందిన చంద్రగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించి వివరాలు సేకరించారు.

Andhra: ఫ్రెండ్‌ను చంపి రక్త చరిత్ర సాంగ్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Crime News

Edited By:

Updated on: Jan 18, 2026 | 2:42 PM

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన యువకుడి హత్య కలకలం రేపింది. తులసినాయనపల్లి సమీపంలో యువకుడు అనుమానాస్పద మృతి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి తిమ్మరాజుపల్లికి చెందిన చంద్రగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై పోలీసుల విచారణ జరుగుతున్నారు.. ఈ క్రమంలోనే.. చంద్ర మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. చంద్రను హత్య చేశారని పేర్కొంటున్నారు.

ఇంస్టాగ్రామ్ పట్టించింది.

శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి చెందిన చంద్ర హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు ఇంస్టాగ్రామ్ పోస్ట్ ను గుర్తించారు.

స్నేహితుడు ఉదయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోతో తనే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత కొంతమంది కూడా ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్ర స్నేహితుల వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం.. వివరాలను వెల్లడించనున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..