లోకల్ టాలెంట్.. మామూలుగా లేరుగా.. అచ్చం సినీ హీరోలకు ఏమాత్రం తీసిపోరు..!
అచ్చం సిని హీరోలకు ఏమాత్రం తీసిపోరు ఆ పిల్లలు. తమ అభిమాన హీరోలను అచ్చం తలదన్నేలా వేషం వేసి శభాష్ అనిపించుకున్నారు ఆ బుడతలు. సాధారణంగా ఏరువాక పౌర్ణమి రోజు అంటే అందరికి గుర్తు వచ్చేది గ్రామల్లో బసవన్నల పారువేట, అన్నదాతలు తమకు చేదోడు వాదోడుగా ఉండే బసవన్నలను అందంగా తీర్చి దిద్ది సంబరాలు చేసుకుంటారు.

అచ్చం సిని హీరోలకు ఏమాత్రం తీసిపోరు ఆ పిల్లలు. తమ అభిమాన హీరోలను అచ్చం తలదన్నేలా వేషం వేసి శభాష్ అనిపించుకున్నారు ఆ బుడతలు. సాధారణంగా ఏరువాక పౌర్ణమి రోజు అంటే అందరికి గుర్తు వచ్చేది గ్రామల్లో బసవన్నల పారువేట, అన్నదాతలు తమకు చేదోడు వాదోడుగా ఉండే బసవన్నలను అందంగా తీర్చి దిద్ది సంబరాలు చేసుకుంటారు. కానీ అక్కడ మాత్రం ప్రతి సంవత్సరం లాగా ఈసారి వేడుకలు వినూత్న రీతిలో సాగాయి. ఏరువాక పౌర్ణమి సందర్బంగా అక్కడి యువకులు తమ తమ అభిమాన సినీ నటుల వేషధారణలు వేసుకుని వేడుకలను జరుపుకున్నారు. ఈ వినూత్న వేడుకలు ఎక్కడో కాదు కర్నూలు జిల్లాలో జరిగాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఉదయన్నే తమ వృషభాలకు స్నానాలు చేయించి, ప్రత్యేక అలంకారణాలు చేసి సాయంత్రం పారువేట పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామంలోని యువకులు వేసుకున్న వేషధారణ అందరిని ఎంతగానో అకట్టుకున్నాయి. యువకులు తమ తమ ఇష్టమైన హీరోల వేషధారణలతో నూతనంగా వస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలో నుండి రిలీజ్ అయినా ఒక పాటలో రామ్ చరణ్ వేసిన వేషధారణలో, అల్లు అర్జున్ నటించిన పుష్ప2 గెటప్, ప్లాస్టిక్ సంచులతో దుస్తులు కుట్టించి వేసుకుని, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం వేశాధారణలు ధరించారు.
ఇలా మొదలైన తమ అభిమాన హీరోల వేషధారణలు వేసి గ్రామ పుర వీధుల్లో తిరుగుతూ హీరోల్లా పోజులు ఇచ్చారు. ఈ ఏరువాక పున్నాక వేడుకల్లో ఈ పిల్లల వేషధారణలు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో తరలి వచ్చారు.
వీడియో… మరిన్ని హ్యమున్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
