MLA Vidudala Rajani: చిలకలూరిపేటలో ఫ్లెక్సీ తెచ్చిన తంటా..! కొత్త చిక్కుల్లో ఎమ్మెల్యే రజనీ..

|

Oct 14, 2021 | 5:03 PM

అభిమానులు చేసిన పనికి ఆమె ఆపదలో పడ్డారు. చిలకలూరిపేటలో పోలేరమ్మ ఉత్సవాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది.

MLA Vidudala Rajani: చిలకలూరిపేటలో ఫ్లెక్సీ తెచ్చిన తంటా..!  కొత్త చిక్కుల్లో ఎమ్మెల్యే రజనీ..
Flexi Controversy
Follow us on

MLA Vidudala Rajani: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అభిమానులు చేసిన పనికి ఆమె ఆపదలో పడ్డారు. చిలకలూరిపేటలో పోలేరమ్మ ఉత్సవాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. దసర సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే రజనిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే, అమ్మవారి ఫొటోలతోపాటు MLA రజిని ఫొటోలను పెట్టారు. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

దేవీశరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అన్ని అవతారాల ఫొటోలను ఫ్లెక్సీగా పెట్టారు. అయితే, వాటి పక్కనే ఎమ్మెల్యే ఫొటోలనే పెట్టడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే ఫోటోలతో ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది ఇప్పుడు బాగా వైరల్‌ అవడంతో ఆలయ నిర్వహకులు అప్రమత్తమయ్యారు. ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ఫొటోలను వెంటనే తొలగించారు. దసరా వేడుకల్లో పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also… Dasara: హైదరాబాద్ బెంగాలీ సమితిలో ఘనంగా నవమి వేడుకలు.. ఆయుధ పూజలో పాల్గొన్న జూపల్లి రామ్ రావు