New Year: ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల న్యూ ఇయర్ విషెస్..

కొత్త సంవత్సరం వచ్చేసింది. 2022కు వీడ్కోలు చెప్పి.. కొంగొత్త ఆశలతో 2023లోకి ఎంట్రీ ఇచ్చేశాం. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...

New Year: ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల న్యూ ఇయర్ విషెస్..
New Year Celebrations

Updated on: Jan 01, 2023 | 9:48 AM

కొత్త సంవత్సరం వచ్చేసింది. 2022కు వీడ్కోలు చెప్పి.. కొంగొత్త ఆశలతో 2023లోకి ఎంట్రీ ఇచ్చేశాం. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఎం సూచించారు. ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి నూతన సంవత్సరం బాటలు వేయాలని అభిలషించారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

మరోవైపు.. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరికీ అద్భుతంగా సాగాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ‘దేశ ప్రధాన మంత్రి మోడీ ట్వీట్‌ చేస్తూ ‘2023 అందరికీ అద్భుతంగా ఉండాలి. ఆశలు, ఆనందం, విజయాలతో నిండి కొత్త ఏడాది నిండిపోవాలి. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఆశీర్వదించబడాలి’ అని ఆకాంక్షించారు. ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..